స్వామీ ..వాళ్ళు నాతొ అంటున్నారూ.. మీరేమో నన్ను భూలోకానికి పంపేస్తారంట...కానీ అక్కడ ఇంత చిన్నవాడినైన నేను నిస్సహాయంగా ఒక్కడినే ఎలా బతుకగలను? “ భయం లేదు . అక్కడ ఒక దేవత నీ సంరక్షణ విషయం చూసుకుంటుంది...” అది కాదు దేవా...అక్కడ నేను ఏమిచేయాలో ? ఏ పనులు చేయాలో? ఇక్కడ ఈ స్వర్గం లో మీ దగ్గర నాకు కేవలం నవ్వుతూ, పాడుతూ ఉండడమే పని కదా..అది తప్పా నాకు ఇంకేమీ రాదు కదా ! “భయం లేదు...అక్కడ నీ దేవతే నీ కోసం చిరు నవ్వులు చిందిస్తుంది...పాడుతుంది ...నీకు ఆ నవ్వులో, ఆ పాటలలో మాధుర్యం, స్వచ్చతా అనుభవంలోకి వస్తాయి “ మరి అక్కడ మనుషులు నాతొ ఒకప్పుడు మాట్లాడితే నాకు ఎలా అర్ధం అవుతుంది...అక్కడి భాష నాకు రాదు కదా ? “ ఆ భయం వద్దు ..ఎందుకంటే నీ దేవత నీకు చాలా మధురమైన మాటలను, చాలా ఓర్పుగా,ప్రేమతో నీతో మాటాడుతూ నేర్పుతుంది..ఎలా మాట్లాడాలో కూడా నేర్పుతుంది” అయితే మరి నేను నీతో మాట్లాడాలీ అన్నప్పుడు నేను ఏమి చేయాలి ? “ ఆ భయం ఎందుకు నాన్నా . ఎందుకంటే నీ దేవత నిన్ను తన చేతులలో, ఒళ్ళో తీసుకోనీ నీకు నన్ను ఎలాగా ప్రార్దించాలో కూడా నేర్పుతుంది” ...