Skip to main content







స్వామీ ..వాళ్ళు నాతొ అంటున్నారూ.. మీరేమో నన్ను భూలోకానికి పంపేస్తారంట...కానీ అక్కడ ఇంత  చిన్నవాడినైన నేను నిస్సహాయంగా ఒక్కడినే ఎలా బతుకగలను?

 “ భయం లేదు . అక్కడ ఒక దేవత నీ సంరక్షణ విషయం చూసుకుంటుంది...”

అది కాదు దేవా...అక్కడ నేను ఏమిచేయాలో ? ఏ పనులు చేయాలో? ఇక్కడ ఈ స్వర్గం లో మీ దగ్గర నాకు కేవలం నవ్వుతూ, పాడుతూ ఉండడమే పని కదా..అది తప్పా నాకు ఇంకేమీ రాదు కదా !

 “భయం లేదు...అక్కడ నీ దేవతే నీ కోసం చిరు నవ్వులు చిందిస్తుంది...పాడుతుంది ...నీకు ఆ నవ్వులో, ఆ పాటలలో మాధుర్యం, స్వచ్చతా అనుభవంలోకి వస్తాయి “

మరి అక్కడ మనుషులు నాతొ ఒకప్పుడు మాట్లాడితే నాకు ఎలా అర్ధం అవుతుంది...అక్కడి భాష నాకు రాదు కదా ?

 “ ఆ భయం వద్దు ..ఎందుకంటే నీ దేవత నీకు చాలా మధురమైన మాటలను, చాలా ఓర్పుగా,ప్రేమతో నీతో మాటాడుతూ నేర్పుతుంది..ఎలా మాట్లాడాలో కూడా నేర్పుతుంది”

అయితే మరి నేను నీతో మాట్లాడాలీ అన్నప్పుడు నేను ఏమి చేయాలి ?

 “ ఆ భయం ఎందుకు నాన్నా . ఎందుకంటే నీ దేవత నిన్ను తన చేతులలో, ఒళ్ళో తీసుకోనీ నీకు నన్ను ఎలాగా ప్రార్దించాలో కూడా నేర్పుతుంది”

మరి నన్ను ఎవరు రక్షిస్తూ ఉంటారు?? నువ్వే కదా !

 “ అదికాదమ్మా ..అవసరమైతే ..తన జీవితాన్ని కూడా పణంగా పెట్టీ నీ దేవతే నిన్ను రక్షించుకుంటుంది”

కానీ ఇక  నువ్వు కనిపించకపోతే నాకు చాలా బాధగా ఉంటుంది.

 “ అయ్యో..నువ్వు నా దగ్గరికి రావాలంటే ఆ దేవతే నీకు నా మాటలు చెప్తూ నన్ను చేరే మార్గాన్ని కూడా నీకు చూపిస్తూ ఉంటుంది. ఒక మాట చెప్పనా. నేను నీకు కనబడక పోయినా నేనెప్పుడూ నీ చుట్టూనే ఉంటా కదా “

అయ్యో భగవాన్ ...ఇక్కడికి అప్పుడే ఆ భూలోకపు మనుష్యుల మాటలు వినబడుతున్నాయి. నాకు తొందరగా ఒక మాట చెప్పు ...ఇప్పుడే నేను వెళ్ళవలస వస్తే దయచేసి ఆ దేవత పేరు చెప్పవూ ...

 “ ఆ దేవత పేరు...”అమ్మ “

(ఎవరో, ఎప్పుడో చెప్పిన కధ)

Comments

Popular posts from this blog

శ్రీదేవ్యపరాధక్షమాపణా స్తోత్రం..తెలుగులో భావం

శ్రీ మాత్రే నమః శ్రీదేవీ అపరాధ క్షమాపణా స్తోత్రం ...శ్రీ ఆది శంకరాచార్య విరచితం తెలుగులో భావము ::: భమిడిముక్కుల క్రిష్ణ మూర్తి ఈ స్తోత్రం లో శ్రీ ఆది శంకరాచార్యులవారు జగన్మాతను తానూ తెలిసో , తెలియకో చేసిన పాపాలనూ , తప్పులను క్షమించమనీ కోరుతున్నారు..దీనిని అందరూ తెలుసుకోనీ , అర్ధం చేసుకొనీ , అదే విధానం లో ఇదే స్తోత్రాన్ని పఠనం చేసుకోవాలి .... జగన్మాత శ్రీ దుర్గా దేవీ స్తోత్రాలలో శ్రీ దుర్గా దేవీ అపరాధ క్షమాపణా స్తోత్రాన్ని మించినది లేదు ఈ స్తోత్రం   అమ్మ యొక్క కరుణా ప్రాప్తి విషయం లో సాధకుడిని నిలబెడుతుంది. శ్రీ దుర్గా మాతని పూజించిన తర్వాత ఈ స్తోత్ర   పఠనం తప్పక సాధన   చెయ్యాలి. ఎవరైతే సాధకులు ఈ స్తోత్రపఠనం చేస్తారో , వారికి తమ జీవితం లో మార్పు పొంది నాణ్యమైన , మెరుగైన జీవితంగా మారడం గమనిస్తారు. అంటే తమ తమ జీవితాల్లో నాణ్యమైన మార్పు ను అమ్మ అనుగ్రహం వల్ల పొందుతారు... 1.       న మంత్రం నో యంత్రం తదపి చ న జానే స్తుతి మహో న చాహ్వానం ధ్యానం తదపి చ న జానే స్తుతి కథాః న జానే ముద్రాస్తే తదపి చ న జానే విలపనం పరం జానే మ...