Skip to main content

శ్రీదేవ్యపరాధక్షమాపణా స్తోత్రం..తెలుగులో భావం



శ్రీ మాత్రే నమః

శ్రీదేవీ అపరాధ క్షమాపణా స్తోత్రం ...శ్రీ ఆది శంకరాచార్య విరచితం

తెలుగులో భావము ::: భమిడిముక్కుల క్రిష్ణ మూర్తి

ఈ స్తోత్రం లో శ్రీ ఆది శంకరాచార్యులవారు జగన్మాతను తానూ తెలిసో, తెలియకో చేసిన పాపాలనూ, తప్పులను క్షమించమనీ కోరుతున్నారు..దీనిని అందరూ తెలుసుకోనీ ,అర్ధం చేసుకొనీ, అదే విధానం లో ఇదే స్తోత్రాన్ని పఠనం చేసుకోవాలి ....

జగన్మాత శ్రీ దుర్గా దేవీ స్తోత్రాలలో శ్రీ దుర్గా దేవీ అపరాధ క్షమాపణా స్తోత్రాన్ని మించినది లేదు ఈ స్తోత్రం  అమ్మ యొక్క కరుణా ప్రాప్తి విషయం లో సాధకుడిని నిలబెడుతుంది. శ్రీ దుర్గా మాతని పూజించిన తర్వాత ఈ స్తోత్ర  పఠనం తప్పక సాధన  చెయ్యాలి. ఎవరైతే సాధకులు ఈ స్తోత్రపఠనం చేస్తారో , వారికి తమ జీవితం లో మార్పు పొంది నాణ్యమైన, మెరుగైన జీవితంగా మారడం గమనిస్తారు. అంటే తమ తమ జీవితాల్లో నాణ్యమైన మార్పు ను అమ్మ అనుగ్రహం వల్ల పొందుతారు...


1.      న మంత్రం నో యంత్రం తదపి చ న జానే స్తుతి మహో
న చాహ్వానం ధ్యానం తదపి చ న జానే స్తుతి కథాః
న జానే ముద్రాస్తే తదపి చ న జానే విలపనం
పరం జానే మాతస్త్వదనుసరణం క్లేశహరణమ్

ఓ మాతా!...నాకు మంత్రము కానీ తంత్రము కానీ ఏదేని స్తోత్ర విధానము కానీ తెలియదు. కనీసం నిన్ను ఎలా వేడుకోవాలో కూడా తెలియదు...నీతో ఎలా మధ్యవర్తిత్వం నడపాలో కూడా తెలియదు...నాకు సంగీత పాటవం కూడా లేదు. నాకు జప ముద్రా విధానం తెలియదు. కానీ నేను నిన్ను మాత్రం శరణు వెడితే నా సకల బాధలూ పటాపంచాలవుతాయనీ మాత్రం తెలుసు .. అమ్మా నాకు నీవే శరణు శరణు .

2.      విధేరజ్ఞానేన ద్రవిణ విరహేణాలసతయా
విధేయా శక్యత్వాత్తవ చరణయోర్యాచ్యుతిరభూత్
తదేతత్ క్షంతవ్యం జనని సకలోద్ధారిణి శివే
కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతా న భవతి

ఓ దయామయీ...నీవు నీ  కరుణను ఎటువంటి విచక్షణా భావం లేకుండా అందరికీ పంచుతావు. నాకు సరియిన పూజా విధానం తెలియదు. పైగా సహజం గా నేను సోమరిని అయిన నేను సరియిన ప్రార్ధనలు కూడా చేయలేను. ఇన్ని లోపాలతో నిన్ను ప్రార్ధిస్తున్న నన్ను అవి అన్నీ మరచీ క్షమించు . ఎందుకంటే ఒక పుత్రుడు చెడ్డవాడు కావచ్చు కానీ తల్లీ...., అమ్మ సహజంగానే  దయామయి కదా.   అమ్మా నాకు నీవే శరణు శరణు.

3.      పృథివ్యాం పుత్రాస్తే జనని బహవః సంతి సరళాః
పరం తేషాం మధ్యే విరల విరలోzహం తవ సుతః
మదీయోzయం త్యాగః సముచిత మిదం నో తవ శివే
కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతా న భవతి

ఓ తల్లీ..ఈ భూమి లో నీకు చాలా మంది ఉత్తమమైన పుత్రులూ, పుత్రికలూ ఉన్నారు. కానీ వీరందరిలో నేను మాత్రం చాలా చెడ్డ వాడిగా ఉన్న నీ పుత్రుడని. ఓ దేవీ.. నేను నీ పట్ల ఆరాధనా భావము లేనివాడిననీనీవు నాపై చిన్న చూపు చూసినావా?ఇది భావ్యము కాదు.  ఎందుకంటే ఒక పుత్రుడు చెడ్డవాడు కావచ్చు కానీ తల్లీ.... అమ్మ ప్రవుత్తి పరంగా  చాలా కరుణామయి  కదా.   అమ్మా నాకు నీవే శరణు శరణు.

4.      జగన్మాతర్మాతస్తవ చరణ సేవా రచితా
న వా దత్తం దేవి ద్రవిణమపి భూయస్తవ మయా
తథాపి త్వం స్నేహం మయి నిరుపమం యత్ప్రకురుషే
కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతా న భవతి .

ఓ జగన్మాతా ! నేను ఎప్పుడూ మీ కాళ్ళను పట్టి ఉండలేదు , ఎటువంటి సేవలూ మీకు చేయలేదు. ఎటువంటి సంపదలూ మీకు కానుకలుగా సమర్పించి ఉండలేదు...కానీ చాలా వింతగా నీవు ఈ అనర్హుడిపై అపార దయను కురిపించీ నావు. ఎందుకంటే ఒక పుత్రుడు చెడ్డవాడు కావచ్చు కానీ తల్లీ......అమ్మ సహజంగానే కనికరము కలది కదా.   అమ్మా నాకు నీవే శరణు శరణు.

5.      పరిత్యక్తా దేవా వివిధ విధ సేవాకులతయా
మయా పంచాశీతేరధిక మపనీతే తు వయసి
ఇదానీం చేన్మాతస్తవ యది కృపా నాzపి భవితా
నిరాలంబో లంబోదరజనని కం యామి శరణమ్.

ఓ పార్వతీ మాతా......ఇంతకాలమూ నేను ఎందరో దేవీ దేవతలకు ప్రణమిల్లీ పూజలు చేసిన వాడను.. నాకు ఇప్పుడు ఎనుబది సంవత్స్తరములు  నిండా పైబడినది నాలో శక్తి క్షీణించినది . నాకున్న వివిధ కార్యకలాపాలు కూడా కారణమే అయినవి. నేను వారికి ఇక ఎటువంటి అర్పణములు చేయలేను.  నేను వారినుండీ ఎటువంటి సహాయమూ ఆశించుటలేదు .వారందరూ నన్ను విడిచిపెట్టిన కారణము వలన నేను పూర్తిగా నిరుస్తాహవంత స్దితిలో ఉన్నవాడను..ఈ స్దితిలో నీవు తప్పా ఇంకా ఎవరు నన్ను  ఆదుకొనగలరు? అమ్మా నాకు నీవే శరణు శరణు .

6.      శ్వపాకో జల్పాకో భవతి మధుపాకోపమగిరా
నిరాంతంకోరంకో విహరతి చిరం కోటికనకైః
తవాపర్ణే కర్ణే విశతి మను వర్ణే ఫలమిదం
జనః కో జానీతే జనని జపనీయం జప విధౌ.

ఓ అపర్ణా దేవీ! కుక్క మాంసము తినే చండాలుడు నీ పేరుని స్మరిస్తే చాలు తన నాలుకతో తేనె లాంటి మధురమైన వాక్కులు మాట్లాడగలుగుతున్నాడు. కడు పేద కూడా నీ నామ జప మహిమ వలన మిక్కిలి సంపద పొందినవాని వలే భయము లేకుండా మసలు చున్నాడు ...ఓ మాతా ! మరి అలాగ అయితే, తగిన రీతిలో మనసుతో నీ నామ స్మరణ చేయు వానికి ఇంకా ఏమి దొరుకునో ఎవరు చెప్పగలరు...అమ్మా! నాకు నీవే శరణు శరణు.

7.      చితాభస్మాలేపో గరళమశనం దిక్పటధరో
జటాధారీ కంఠే భుజగపతిహారీ పశుపతిః
కపాలీ భూతేశో భజతి జగదీశైకపదవీం
భవానీ త్వత్పాణిగ్రహణ పరిపాటీఫలమిదమ్.

ఓ కపాలీ!...ఎవరైతే భస్మాన్ని తన వొంటికి రాసుకొని ఉన్నారో, తన శరీరముపై దుస్తులు ఏ రకముగా  ఉండాలనీ భావించారో, ఎవరైతే దట్టమైన వృక్ష సంపదని తన శరీరము పై వెంట్రుకలుగా ఉంచుకున్నారో, ఎవరైతే భయంకర సర్పాన్ని తన కంఠ భూషణం గా అమర్చుకున్నారో, ఎవరైతే పశుపతి గా పిలవ బడుతున్నారో , ఇంకా ఎవరైతే ఆత్మలన్నింటినీ తన ఆధీనములో ఉంచుకున్నారో , ఎవరైతే విష కంఠం ధరించి ఉన్నారో , ఎవరైతే ఈ విశ్వానికే స్వామీ అని పిలవబడుతున్నారో ..ఓ భవానీ! ఇదంతా అతనికి నీవు అండగా నిలబడి సహాయకారిగా ఉన్న ఫలితమే కదా....... అమ్మా! నాకు నీవే శరణు శరణు.

8.      మోక్షాస్యాకాంక్షా విభవవాంఛాపి మే
న విజ్ఞానాపేక్షా శశిముఖి! సుఖేచ్ఛాపి న పునః
అత స్త్వాం సంయాచే జనని జననం యాతు మమ వై
మృడానీ రుద్రాణీ శివ శివ భవానీతి జపతః..

ఓ చంద్ర ముఖీ ! మోక్షాన్ని పొందాలన్న ఆశ నాకు లేదు, మరి విలాసాలూ ఇంకా  ఈ ప్రపంచంలో పేరు ప్రఖ్యాతులూ పొందాలన్న వాంఛ కూడా లేదు ...నాకు శాస్త్రాల పరిజ్ఞానం కూడా పొందాలనీ లేదు..ఇతరత్రా సౌకర్యాలూ, సుఖాలూ కూడా పొందాలనీ లేదు..కానీ అమ్మా..నేను ఎప్పుడెప్పుడు  జన్మిస్తూ ఉంటానో నాకు మీ ఈ నామాలు జపించే అవకాశాలు ఇవ్వండి మృడాణీ..రుద్రాణీ..శివ..శివ ..భవానీ ...... అమ్మా! నాకు నీవే శరణు శరణు.

9.      నారాధితాసి విధినా వివిధోపచారైః |
కిం సూక్ష్మచింతనపరైర్న కృతం వచోభిః ||
శ్యామే! త్వమేవ యది కించన మయ్యనాథే |
ధత్సే కృపాముచితమంబ పరం తవైవ.

ఓ శ్యామా! నేను మిమ్ములను పూజ్యనీయ భావనతో, శాస్ర విధితో ఎప్పుడూ ఆరాధనలు చేయలేదు . నేను అనాగరికంగా నా భావాలూ, వాక్కులూ మించి నేనేమీ ప్రవర్తించలేదు ... అయినప్పటికీ  మీరు నన్ను కరుణా హృదయంతో ఈ నిరాశ్రయుడనీ, అనాధనీ  చేరదీసీ కరుణ చూపించారు .. అది మీకే సాధ్యం ..ఎందుకంటే మీరు అన్నింటికీ అతీతులు... అమ్మా! నాకు నీవే శరణు శరణు.

10.  ఆపత్సుమగ్నస్స్మరణం త్వదీయం |
కరోమి దుర్గే కరుణార్ణవే శివే |
నైతచ్ఛఠత్వం మమ భావయేథాః |
క్షుధాతృషార్తా జననీం స్మరంతి..

ఓ దుర్గా! ఓ కరుణా సాగర హృదీ! నేను నా కష్టాలలో, దుఃఖంలో  నిన్ను ప్రార్ధించినపుడు నన్ను ఒక మూర్ఖుడిగా చూడకు...ఒక పిల్లవానికి ఆకలి వేసినపుడు ఆ పిల్లవాడు తన తల్లినే తప్పా ఇంకెవరినీ తలంచడు . అమ్మా! నాకు నీవే శరణు శరణు.

11.  జగదంబ విచిత్ర మత్ర కిం పరిపూర్ణా కరుణాస్తి చే న్మయి |
అపరాధపరంపరావృతం న హి మాతా సముపేక్షతే సుతమ్.

ఓ జగత్ జననీ!  మీరు నా పట్ల మిక్కిలి కరుణా, దయా, జాలీ కలిగి ఉన్నారు ...ఇదేమీ ఆశ్చైర్యము కాదే...ఎందుకంటే పిల్లవాడు ఎన్ని తప్పులు, దోషములూ మరల మరలా  చేసిననూ తల్లి అతనిని నిర్లక్ష్యము చేయునా లేక తనవాడు కాదందునా? ........ అమ్మా! నాకు నీవే శరణు శరణు.

12.  మత్సమః పాతకీ నాస్తి పాపఘ్నీ త్వత్సమా న హి |
ఏవం జ్ఞాత్వా మహాదేవీ యథా యోగ్యం తథా కురు .

ఓ మహాదేవీ! నా వంటి భ్రస్టు పాలయిన వారు ఎవ్వరునూ  లేరు....మరియూ....సర్వ పాప విముక్తులను చేయటలో మీకు సాటి ఎవ్వరునూ లేరు ...అందువలననే ప్రవీణత గల్గిన మీరు నాకు అనుగుణ మైనదే చేయుడు .... ........ అమ్మా! నాకు నీవే శరణు శరణు.



सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके ।
शरण्ये त्र्यम्बके गौरि नारायणि नमोऽस्तु ते ॥


Comments

Popular posts from this blog

స్వామీ ..వాళ్ళు నాతొ అంటున్నారూ.. మీరేమో నన్ను భూలోకానికి పంపేస్తారంట...కానీ అక్కడ ఇంత   చిన్నవాడినైన నేను నిస్సహాయంగా ఒక్కడినే ఎలా బతుకగలను?   “ భయం లేదు . అక్కడ ఒక దేవత నీ సంరక్షణ విషయం చూసుకుంటుంది...” అది కాదు దేవా...అక్కడ నేను ఏమిచేయాలో ? ఏ పనులు చేయాలో? ఇక్కడ ఈ స్వర్గం లో మీ దగ్గర నాకు కేవలం నవ్వుతూ, పాడుతూ ఉండడమే పని కదా..అది తప్పా నాకు ఇంకేమీ రాదు కదా !   “భయం లేదు...అక్కడ నీ దేవతే నీ కోసం చిరు నవ్వులు చిందిస్తుంది...పాడుతుంది ...నీకు ఆ నవ్వులో, ఆ పాటలలో మాధుర్యం, స్వచ్చతా అనుభవంలోకి వస్తాయి “ మరి అక్కడ మనుషులు నాతొ ఒకప్పుడు మాట్లాడితే నాకు ఎలా అర్ధం అవుతుంది...అక్కడి భాష నాకు రాదు కదా ?   “ ఆ భయం వద్దు ..ఎందుకంటే నీ దేవత నీకు చాలా మధురమైన మాటలను, చాలా ఓర్పుగా,ప్రేమతో నీతో మాటాడుతూ నేర్పుతుంది..ఎలా మాట్లాడాలో కూడా నేర్పుతుంది” అయితే మరి నేను నీతో మాట్లాడాలీ అన్నప్పుడు నేను ఏమి చేయాలి ?   “ ఆ భయం ఎందుకు నాన్నా . ఎందుకంటే నీ దేవత నిన్ను తన చేతులలో, ఒళ్ళో తీసుకోనీ నీకు నన్ను ఎలాగా ప్రార్దించాలో కూడా నేర్పుతుంది” ...